Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పది రూపాయల నోట్లు పంచి... మోసం చేసిన చ‌రిత్ర ఎమ్మెల్యే వసంతది!

పది రూపాయల నోట్లు పంచి... మోసం చేసిన చ‌రిత్ర ఎమ్మెల్యే వసంతది!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (11:01 IST)
ప్ర‌స్తుత మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చ‌రిత్ర అంతా మోసంతో కూడిన‌ద‌ని దేవినేని ఉమామహేశ్వర రావు విమ‌ర్శించారు. స్థానిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అరాచక పాలనను సామాన్యులు చీదరించుకుటున్నారని అన్నారు. సాధారణ కూలీలకు ఉపాధి దొరకడంలేదని, ఇది మార్పుకు సంకేతమన్నారు. కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించడం తథ్యమన్నారు. పది రూపాయల నోట్లు పంచి  ప్రజలను మోసం చేసిన చరిత్ర వసంత కృష్ణ ప్రసాదుది అని దేవినేని ఉమ విమ‌ర్శించారు. 
 
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య మాట్లాడుతూ, కొత్తగేటులో జరిగిన ప్రతి అభివృద్ధిలో  తెలుగు దేశం పార్టీ పాత్ర ఉందని అన్నారు. రేషన్ దుకాణం ఏర్పాటు మొదలుకొని, సిసి రోడ్లు, పక్కా డ్రైన్లు వంటి అనే సమస్య లకు శాశ్వత పరిష్కారం తెలుగు దేశం పార్టీ ఆద్వర్యంలో నే జరిగింది అని స్పష్టం చేశారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ప్లై యాష్ పాండ్ నుండి వేలాది టన్నులు ప్లై యాష్ ను ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ బావమరిది అమ్ముకుంటున్నారన్నారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో మట్టిని కూడా త‌వ్వి తరలించారని విమర్శించారు.
 
 తెలుగు దేశం కొండపల్లి మునిసిపాలిటీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అధ్వర్యంలో కొండపల్లిలోని శాలివాహన నగర్, శ్రామిక నగర్ కొత్తగేటులో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు బోగస్ అనే వ్యక్తి , గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి అవే పట్టాలను తీసుకుని నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం చేసుకున్నాడని గుర్తు చేశారు. ప్ర‌చారంలో 26వ డివిజన్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ కార్యదర్శి అమర్లపూడి ప్రేమానందం, వల్లెపు కనకయ్య, కొరదల బాబు, కోట్ల రాజు, మందపాటి వినోద్ కుమార్, చెల్లింగి శ్రీధర్, కృష్ణ వేణి  కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా లక్షణాల నుంచి 93.4 శాతం రక్షణ కల్పిస్తున్న కోవాగ్జిన్