Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా, కెనడాలపై హిమ ఖడ్గం... మైనస్‌ 45 డిగ్రీలతో గజగజ

అమెరికా, కెనడా దేశాలు మంచు తుఫానులో కూరుకునిపోయాయి. ఈ దేశాల్లో ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు నమోదైంది. దీంతో అమెరికా తూర్పు తీరం, కెనడా చలికి గడ్డ కట్టుకుపోయాయి. ఫలితంగా ఈ దేశాల వాసులు గజగజ వణికిపోతున్న

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (08:42 IST)
అమెరికా, కెనడా దేశాలు మంచు తుఫానులో కూరుకునిపోయాయి. ఈ దేశాల్లో ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు నమోదైంది. దీంతో అమెరికా తూర్పు తీరం, కెనడా చలికి గడ్డ కట్టుకుపోయాయి. ఫలితంగా ఈ దేశాల వాసులు గజగజ వణికిపోతున్నారు.
 
‘బాంబ్‌’ మంచు తుఫాన్‌ తర్వాత ‘ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌’తో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న ప్రమాదకర చలిగాలులకు ఇరుదేశాలు వణికిపోతున్నాయి. అమెరికాలోని మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, కెనడాలోని ఉత్తర అంటారియో, క్యూబెక్‌లలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మంచుతుఫాన్ కారణంగా టెక్సాస్ నుంచి విస్కాన్సిన్ వరకు ఇప్పటివరకు 19మంది మృతిచెందారు. 
 
న్యూయార్క్, దక్షిణ కరోలినా సహా పలు ప్రాంతాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. 2250 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పలు నగరాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. మరోవైపు స్పెయిన్‌లో హిమపాతం కారణంగా వాహనాల్లో చిక్కుకుపోయిన వందలాదిమంది డ్రైవర్లను రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments