Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో కాల్పుల కలకలం: ఐదుగురు మృతి

అమెరికాలోని పలు ప్రాంతాల్లో కాల్పులు ఘటనలు కలకలం రేపింది. అమెరికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు

Advertiesment
అమెరికాలో కాల్పుల కలకలం: ఐదుగురు మృతి
, ఆదివారం, 31 డిశెంబరు 2017 (09:16 IST)
అమెరికాలోని పలు ప్రాంతాల్లో కాల్పులు ఘటనలు కలకలం రేపింది. అమెరికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు. 
 
పనిలో ఉన్న ఉద్యోగులు కాల్పుల శబ్దం విని పరుగులు తీశారు. కొందరు డెస్క్‌ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తర్వాత దుండగుడిని పోలీసులు హతమార్చారు. అలాగే హూస్టన్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
 
ఓ ఆటోషాప్‌లో గతంలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం షాపులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన దుండగుడు బయటకు వచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరై వుంటారనే దానిపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌ది హవాలా ఫార్ములా.. దొడ్డిదారిలో పార్టీలోకి వచ్చారు: ఈపీఎస్