దక్షిణాసియాలో అణుయుద్ధానికి అవకాశం ఉంది: పాకిస్థాన్ సెక్యూరిటీ అడ్వైజర్
						
		
						
				
భారత్‌పై పాకిస్థాన్ భద్రతా సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోందని.. వాటిని నిల్వ కూడా చేసుకుంటుందని జు
			
		          
	  
	
		
										
								
																	భారత్‌పై పాకిస్థాన్ భద్రతా సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోందని.. వాటిని నిల్వ కూడా చేసుకుంటుందని జుంజువా తెలిపారు. భారత్ దాచిపెట్టుకునే ఆయుధాలతో పాకిస్థాన్ భయపెడుతూ వస్తోందని తెలిపారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో భారత్‌తో కలిసి అమెరికా కుట్రలకు పాల్పడుతోందని జాంజువా ఆరోపించారు. తద్వారా దక్షిణాసియా ప్రమాదపు అంచుల్లోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 
	 
	ఆప్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశాన్ని అమెరికా భారత్‌కు ఇస్తుందని విమర్శలు చేశారు. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో అమెరికా తన వైఫల్యాలను పాకిస్థాన్‌పై నెడుతోందని నజీర్ మండిపడ్డారు.