Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని: వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ శ్రద్ధగా వినాల్సిందే. అలాంటి స్పీచ్ ఆయనిస్తారు. తాజాగా 29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉ

Advertiesment
బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని:  వెంకయ్య
, సోమవారం, 1 జనవరి 2018 (17:52 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ శ్రద్ధగా వినాల్సిందే. అలాంటి స్పీచ్ ఆయనిస్తారు. తాజాగా 29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి చేసిన పాత చింతకాయపచ్చడి గురించి మాట్లాడారు. పాత చింతకాయపచ్చడిని అంత సులువుగా కొట్టిపారేయకూడదన్నారు. ఎందుకంటే తాను ఓసారి అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ పాత చింతకాయపచ్చడే ఎంతో సహకరించిందన్నారు. 
 
అమెరికాకు వెళ్ళినప్పుడు పాతచింతకాయ పచ్చడి, చింతాకు పొడి, మినుముల పచ్చడి కొంత ప్యాక్ చేసి మా ఆవిడ ఇస్తే వాటిని తీసుకెళ్లాను. అమెరికాలో బ్రెడ్ ఇస్తారు. ఆ బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్. ఆరోగ్యం బాగాలేకపోతేనే బ్రెడ్ తినడం మనకు అలవాటు. అయితే బ్రెడ్‌పై జామ్ కాకుండా చింతకాయ పచ్చడి రాసుకుని తినే వాడినని చెప్పారు. 
 
తనతో పాటు వచ్చిన పార్లమెంట్ సభ్యురాలు కూడా బ్రెడ్‌లో జామ్‌కు బదులు చింతకాయ పచ్చడి రాసుకుని తినేవారని. ఆమెను మొహమ్మాటం లేకుండా తినండి అని చెప్పేవాడినని తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని.. మనవాళ్లు అమెరికాలో చాలామంది వున్నారని.. దోసెలు, ఇడ్లీలు వంటి మనం అడిగిన వంటకాలను మనముందుకు వస్తున్నాయని వెంకయ్య అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి