Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

Advertiesment
చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి
, సోమవారం, 1 జనవరి 2018 (16:44 IST)
అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కడప, పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద చలి కాచుకుంటున్న నలుగురిపై కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు నలుగు మృతి చెందారు.  
 
కారు వేంపల్లి నుంచి కడపవైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ ‌(14), గిరి (15), భాస్కర్‌ (26) మృతి చెందారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ దుర్ఘటనలో చలికాచుకుంటూ కూర్చున్న ఓ వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. అతడిని కడప రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కారు ప్రమాదానికి కారణమైన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తా: ప్రకాష్ రాజ్ ప్రకటన