Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో లైవ్ షో.. ఎర్రాటి పక్షి ఎగురుకొచ్చి.. యాంకర్ తలపై ఇలా కూర్చుంది (Video)

టీవీలో లైవ్‌ షో జరుగుతున్నప్పుడు ఓ పక్షి ఉన్నట్టుండి ఎగురుకుంటూ వస్తే ఎలా వుంటుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. అమెరికాలోని శాన్‌డియాగోలోని కెఎఫ్ఎంబీ ఛానెల్‌ కోసం ఓ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఆ సమయ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (16:09 IST)
టీవీలో లైవ్‌ షో జరుగుతున్నప్పుడు ఓ పక్షి ఉన్నట్టుండి ఎగురుకుంటూ వస్తే ఎలా వుంటుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. అమెరికాలోని శాన్‌డియాగోలోని కెఎఫ్ఎంబీ ఛానెల్‌ కోసం ఓ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఆ సమయంలో ఎరుపు పక్షి మెడినా అనే యాంకర్ తలపై వాలింది. అంతే తోటి యాంకర్ ఎర్రిక్ పెద్దగా నవ్వేశాడు. అనుకోకుండా తన తలపై పక్షి వాలడంతో యాంకర్ మెడినా కదలకుండా అలాగే కూర్చుండిపోయింది.
 
ఆ పక్షి మళ్లీ ఎగిరి.. ఎర్రిక్ మీద వాలి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. పక్షులపై ఓ ప్రోగ్రామ్ చేయడం కోసం వాటిని పట్టుకొచ్చారు. అందులో ఎరుపు పక్షి పక్కనుంచిన గది నుంచి ఎగురుకుంటూ లైవ్ ప్రోగ్రామ్ జరిగే ప్రాంతానికి వచ్చింది. ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియోను సంబంధిత ఛానల్ యూట్యూబ్‌లో పెట్టడంతో అదీ కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

స్వల్ప అస్వస్థతకు గురైన నిర్మాత బండ్ల గణేష్‌.. కౌంటింగ్ వేళ ఏమైంది?

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న భజే వాయు వేగం

వాట్ ది ఫిష్ షూటింగ్ లో ఎంటర్ అయిన నీహారిక, సుస్మితా ఛటర్జీ

కంటెంట్ ఉన్న సినిమాలే నిలబడుతున్నాయి : మురళి మోహన్

అక్టోబరు 10న రజినీకాంత్ 'వేట్టైయాన్'

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments