Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 70 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (11:53 IST)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మోగ్‌బజార్ వైర్‌లెస్ గేట్ ఏరియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రుల్లో 29 మందిని ఢాకా మెడికలల్ కాలేజికి, 10 మందిని నేషనల్ బర్న్ అండ్ ప్లాస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 
 
మృతుల సంఖ్య మరింతా పెరవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే గ్యాస్ లీకేజీ వల్లే పేలుడు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ అగ్నిమాపపశాఖ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
 
రాత్రి 10.30 గంటల సమయంలో ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షపీఖుల్ ఇస్లామ్ ఘటనా స్థాలానికి వెళ్లి పరిశీలించారు. ఐతే బాంబు పేలుడు లేదా ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ లేదా సిలిండర్ పేలుడు వల్లే ఘటన జరిగి ఉండచ్చవని వెల్లడించారు. స్థానికులు మాత్రం ఎయిర్ కండిషనర్ పేలిపోయినట్లుగా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments