Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ప్రధానికి ఉల్లి సెగ... ఇంట్లో 'ఉల్లి' లేకుండా వంటలు

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (10:09 IST)
ఉల్లిఘాటు సరిహద్దులను దాటిపోయింది. ఇప్పటికే దేశంలో ఉల్లిఘాటు తీవ్రంగా ఉంది. ఫలితంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. వీటిని కిందికి దించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉల్లధరలు కొంతమేరకు తగ్గాయి. 
 
కానీ, ఆసియా దేశాల్లో మాత్రం ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉల్లి ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం పుణ్యమాని ఉల్లిఘాటు సరిహద్దులను దాటిపోయింది. ఈ సెగ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు ఎక్కువగా తగిలింది. దీంతో వంటల్లో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు. 
 
శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్-బంగ్లాదేశ్‌ బిజినెస్‌ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. 'మీరు (భారత్‌) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి' అని కోరారు. 
 
ఆ తర్వాత భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం