Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (11:59 IST)
కరేబియన్ దీవులకు విహార యాత్రకు వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమయ్యారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష కోణంకి అనే విద్యార్థిని విద్యాభ్యాసం చేస్తుంది. ఈమె గతవారం తన స్నేహితులతో కలిసి కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లింది. 
 
డొమినికన్ రిపబ్లికన్‌లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటాకానా ప్రాంతానికి సుదీక్షతో పాటు ఆమె స్నేహితులంతా వెళ్లారు. ఈ నెల 6వ తేదీన రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
భారతదేశానికి చెందిన సుదీక్ష కోణంకి తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాసం హోదా పొందారు. 20 యేళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి ప్రస్తుతం పిట్స్‌బర్గ్ వర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments