చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. మరో 10 మంది గల్లంతైనట్టు తెలిపింది. ఆదివారం నుంచి ఈ ప్రావిన్స్‌లోని మియానింగ్ కౌంటీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం 12 మంది మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 7,00 మందికి ఇహాయీ టౌన్‌షిప్, గయోంగ్ సబ్ డిస్ట్రిక్‌లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. కుండపోత వర్షాల కారణంగా ప్రావిన్స్‌లో 104 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని జిన్హువా పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమయ్యాయి. హైవేలపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.