Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి సంబరాలు.. వెలుగులతో ప్రకాశిస్తున్న భారత్.. ఫోటో చూడండి..

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ఆలయాలు, ఇళ్లు మెరిసిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ వెలుగులతో భారత దేశ

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:42 IST)
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ఆలయాలు, ఇళ్లు మెరిసిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ వెలుగులతో భారత దేశం ప్రకాశించింది. ఈ నేపథ్యంలో దీపావళి నాడు అంతరిక్షం నుంచి తీసిన భారతదేశ ఫొటోను ఓ వ్యోమగామి ట్విట్టర్లో పంచుకున్నారు. 
 
పండగ కాంతులీనుతున్న భారత్‌ పొటోను ఇటలీకి చెందిన పాలో నెస్పోలీ అనే వ్యోమగామి అక్టోబర్‌ 19న ట్వీట్‌ చేశారు. దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లు అందుకుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసినందుకు భారతీయులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీపావళి పర్వదినం రోజు, వాడవాడలా టపాకాయలు పేలుతుంటే, మరోవైపు దీపాలు వెలుగుతున్న ఆ దృశ్యం ఎలా వుందో మీరూ చూడండి.. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments