Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగులే భారతీయుల నమ్మకమైన బ్రాండ్: ప్రపంచ వ్యాప్తంగా అమేజానే టాప్

న్యూయార్క్‌కి చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ కోన్ అండ్ వోల్ఫీ నిర్వహించిన సర్వేలో.. దేశంలో అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ నిలిచింది. గూగుల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ

Advertiesment
గూగులే భారతీయుల నమ్మకమైన బ్రాండ్: ప్రపంచ వ్యాప్తంగా అమేజానే టాప్
, శనివారం, 21 అక్టోబరు 2017 (12:16 IST)
న్యూయార్క్‌కి చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ కోన్ అండ్ వోల్ఫీ నిర్వహించిన సర్వేలో.. దేశంలో అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ నిలిచింది. గూగుల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మారుతీ సుజుకీ, ఆపిల్ సంస్థ‌లు నిలిచాయి. ఇక టాప్-10లో సోనీ, యూట్యూబ్‌, బీఎండ‌బ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్‌, బ్రిటిష్ ఎయిర్‌వేస్ బ్రాండ్లు స్థానం దక్కించుకున్నాయి. 
 
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న‌ట్లు రిపోర్టు తెలిపింది. త‌ర్వాతి స్థానాల్లో ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, పేపా‌ల్ బ్రాండ్లు ఉన్నాయి. 15 దేశాల్లో రెండు నెల‌ల పాటు 1400 బ్రాండ్ల మీద స‌ర్వే చేసి ఈ నివేదిక‌ను రూపొందించిన‌ట్లు కోన్ అండ్ వోల్ఫీ తెలిపింది. 
 
ఈ సర్వేలో బ్రాండ్ న‌మ్మ‌కం మీదే భార‌తీయ వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నార‌ని కోన్ అండ్ వోల్ఫీ నివేదిక పేర్కొంది. భారతీయుల్లో 67 శాతం మంది బ్రాండ్ పేరు చూసే కొనేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వే తెలిపింది. వినియోగదారుడికి ఎల్ల‌ప్పుడూ సేవ‌లందించే బ్రాండ్ల‌ను భార‌తీయులు ఎక్కువగా ఆద‌రించార‌ని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెర్సల్ వివాదం.. విజయ్‌కి కమల్ మద్దతు.. ఆ డైలాగులు తొలగించాల్సిన అవసరం లేదు