Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోకియా 7 స్మార్ట్ ఫోన్ ఫీచర్లివే... ధర ఎంతో తెలుసా?

ప్రముఖ మొబైల్ ఫోన్ దిగ్గజం నోకియా మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే నోకియా 6, నోకియా 8 పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్‌లు విడుదల చేసిన నోకియా, తాజాగా నోకియా 7 పేరుతో మరో మొబైల్‌ను విడుదల చేసిం

Advertiesment
నోకియా 7 స్మార్ట్ ఫోన్ ఫీచర్లివే... ధర ఎంతో తెలుసా?
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:24 IST)
ప్రముఖ మొబైల్ ఫోన్ దిగ్గజం నోకియా మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే నోకియా 6, నోకియా 8 పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్‌లు విడుదల చేసిన నోకియా, తాజాగా నోకియా 7 పేరుతో మరో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను తొలుత చైనాలో లాంఛ్ చేశారు. దీని ధర భారత్‌లో రూ.25 వేలుగా నిర్ణయించారు. ఈ ఫోన్‌లోని ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే.. 
 
5.2 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 630 ప్రొసెసర్, 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128 జీబీ స్టోరేజీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారు చేసిన ఈ ఫోన్ తెలుపు, నలుపు రంగుల్లో లభ్యంకానుంది. 
 
వీటితో పాటు ప్రాక్సిమిటీ, యాక్సిలెరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్(నానో + నానో / మెమరీ కార్డు), ఎల్టీఈ, జీఎస్ఎం, సీడీఎంఏ, హెచ్‌ఎస్‌పీఏ నెట్‌వర్క్‌లతో పాటు... 4G/3G/2G ఇంటర్నెట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5.0 బ్లూ టూత్ వెర్షన్ సౌలభ్యం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు