Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జోలికెళ్తే తాటతీస్తా: పాక్‌కు అమెరికా వార్నింగ్

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (15:38 IST)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచదేశాలు పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కి గతంలో వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి పాక్‌ని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇంకొకసారి భారత్‌పై ఉగ్రదాడి జరిగితే దాని ప్రభావం పాకిస్థాన్‌పై పడుతుందని వార్నింగ్ ఇచ్చింది.


ఉగ్రవాద నిర్మూలనకు పాక్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా పాక్‌కి స్పష్టం చేసింది. జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి ఉగ్ర సంస్థ‌ల‌ను సంపూర్ణంగా మట్టుబెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైట్‌హౌజ్ అధికారులు వెల్లడించారు.
 
మరోసారి భారత్‌పై ఉగ్రదాడి జరిగితే, మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, అలాగే రెండు దేశాల మధ్య శాంతి భద్రతలు విషయంలో ప్రమాదం తలెత్తుతుందని ఆమెరికా అధికారి చెప్పారు. బాలాకోట్ దాడి త‌ర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఏమైనా చ‌ర్య‌లు తీసుకుందా అన్న ప్ర‌శ్న‌కు అమెరికా అధికారులు ఈ విధంగా సమాధానమిచ్చారు.. ఉగ్రవాద చర్యల నిర్మూలనకు పాకిస్థాన్ చేపడుతున్న చర్యలను ఇప్పుడు అంచనా వేయలేమని, ప్రస్తుతానికి ఉగ్ర సంస్థల ఆస్తులను మాత్రం సీజ్ చేసినట్లు ఆయన స్పష్టం చేసారు.
 
అలాగే కొందరు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసి, జైషే స్థావ‌రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంద‌ని చెప్పారు. పాకిస్తాన్ ఇంకా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, అందుకోసం అమెరికా అంత‌ర్జాతీయ దేశాల‌తో క‌లిసి పాకిస్తాన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments