ఇస్లాం సంప్రదాయం ప్రకారం పార్టీకి అమ్మాయిలను(విద్యార్థినిలను) ఆహ్వానించడం విరుద్ధం. కానీ, ఆ ప్రొఫెసర్ మాత్రం పార్టీకి అమ్మాయిలను పిలిచాడు. దీన్ని ఓ విద్యార్థి జీర్ణించుకోలేక పోయాడు. అంతే, ఆ ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బహవాల్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ సాదిఖ్ ఎగెర్టన్ కళాశాలలో ఖలీద్ హమీద్ అనే వ్యక్తి ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయన మరో నాలుగు నెలల్లో రిటైర్డ్ కానున్నారు.
దీంతో ఆయనకు కాలేజీలో వీడ్కోలు పార్టీ ఏర్పాటుచేశారు. ఈ పార్టీకి విద్యార్థినిలను సైతం ఆహ్వానించాడు. నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో ఆడపిల్లలు పాల్గొనడం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ వద్ద ఓ విద్యార్థి ప్రస్తావించాడు. కానీ, అతని నుంచి సరైన సమాధానం రాలేదు. అంతే, కత్తితో సదరు ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఆ ప్రొఫెసర్ ఇపుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, దాడికి ఉపయోగించిన కత్తిని సైతం స్వాధీనం చేసుకున్నారు.