Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాపై మండిపడిన నిక్కీ హేలీ.. కరోనా మృతులు అంత తక్కువా?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:07 IST)
అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ చైనాపై మండిపడ్డారు. కరోనా కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే మరణించారన్న చైనా ప్రకటన వాస్తవానికి చాలా దూరంగా ఉందని నిక్కీ హేలీ అన్నారు. చైనాలో కరోనా కేసులు బయటపడిన రెండు నెలలకు అమెరికాకు పాకిన ఈ వైరస్ అక్కడ ఇప్పటికే 5800 మందిని బలితీసుకుంది. 
 
2.4 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తమ దేశంలో మృతి వారి సంఖ్యను తక్కువ చేసి చెబుతోందన్న ఆరోపణలున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలకు సాయం చేయాల్సింది పోయి.. తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నిజానికి చైనాలో 42 వేల మందికిపైగానే మరణించి ఉంటారన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. యూరప్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా చెప్తున్న లెక్కలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కరోనా మరణాల విషయంలో చైనా చెబుతున్న లెక్కలను నమ్మొద్దంటూ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సూచించిన నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments