Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణ కొరియా కరోనాకు చుక్కలు చూపించింది.. ఎలాగంటే?

Advertiesment
దక్షిణ కొరియా కరోనాకు చుక్కలు చూపించింది.. ఎలాగంటే?
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:28 IST)
చైనాలో కరోనా తొలి కేసు నమోదు కాగానే తమ దేశ సరిహద్దులను మూసివేశామని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. అందుకే మా దేశంలోకి ఈ వైరస్‌ ప్రవేశించలేకపోయింది అని ఆదేశ యాంటి-ఎపిడమిక్‌ విభాగం డైరెక్టర్‌ పాక్‌ మియాంగు సు తెలిపారు. దీనిపై ప్రపంచదేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి విలవిలలాడుతుంటే ఉత్తరకొరియా మాత్రం కరోనా ఫ్రీ కంట్రీ అని పేర్కోనడం అనుమానాలకు తావిస్తోందని ప్రపంచ మేధావులు, నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా సరిహద్దులను మూసివేయడంతోనే కరోనాను నియంత్రించగలిగామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇంకా కరోనాపై పోరాటం కోసం కొరియా పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు క్వారంటైన్‌లో ఉంచింది. కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు. కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. 
 
కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది. టెస్టింగ్ సెంటర్లతోపాటు హాస్పిటళ్లలో ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓ ప్రదేశంలో కరోనా కేసులు నమోదైతే.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపి.. అటు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కనీసం 15 కొరియా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణను దాటేసిన ఏపీ, కేవలం 11 గంటల్లో 12 కేసులు, మొత్తం 161