తెలంగాణను దాటేసిన ఏపీ, కేవలం 11 గంటల్లో 12 కేసులు, మొత్తం 161

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:24 IST)
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజాముద్దీన్ ఘటన చావుదెబ్బ కొట్టింది. అక్కడ నుంచి వచ్చినవారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వునట్లు తేలడంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. తాజాగా ఉదయం 9 గంటలకు మొత్తం 161 కేసులు నమోదు కావడంతో తెలంగాణను దాటేసినట్లయింది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, రాష్ట్రంలో 02-04-2020 రాత్రి 10 గంటల తర్వాత నుంచి 03.04.2020 ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 12 నమోదైనట్లు పేర్కొంది. దీనితో తెలంగాణలో నమోదైన 154 కేసుల నుంచి ఏపీ మించిపోయినట్లయింది.
 

#CovidUpdates: రాష్ట్రం లో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 161 కి పెరిగింది .@AndhraPradeshCM @MoHFW_INDIA #ApFightsCorona pic.twitter.com/qoOYm4loiM

— ArogyaAndhra (@ArogyaAndhra) April 3, 2020

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్: కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తూ చనిపోయిన డెలివరీ మ్యాన్ చివరిసారి ఏం చెప్పాడు?