Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు వెంటిలేటర్ తీసేస్తే.. నర్సులు డ్యాన్స్ చేస్తారు..

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (21:29 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బాధితులకు వైద్యులు, నర్సులు 24 గంటల పాటు చికిత్స అందిస్తూ గడుపుతున్నారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నర్సులు కాసేపు అలా చిందులేస్తూ సంతోషంగా గడిపారు. 
 
దీన్ని ఓ డాక్టర్ వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. కరోనాతో లక్షలమంది ప్రాణాలు పోతుంటే ఈ చిందులేంటని తొలుత కోపగించుకున్నవారే.. ఆ తర్వాత నర్సుల డ్యాన్సులకు అసలు విషయం తెలుసుకుని ఫిదా అయిపోయారు. 
 
ఇంతకీ ఆ కారణమేంటంటే.. అమెరికాలోని రోనాల్డ్ రీగన్ యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్‌లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తారు. పేషెంట్ కోలుకోగానే వెంటిలేటర్ తీసేస్తారు. 
 
ఇలా ఓ పేషెంట్‌కు వెంటిలేటర్ తీసేసిన ప్రతిసారీ ఈ ఆస్పత్రిలోని ఐసీయూ టీం నర్సులు ఇలా డ్యాన్సులు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. కరోనా నుంచి కోలుకుని వెళ్లే ప్రతి పేషెంట్‌ ఇంటికి వెళ్లడంతోనే నర్సులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా చిందులేస్తూ గడుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments