Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలెట్లకు నకిలీ డిగ్రీలు : పాకిస్థాన్ విమానాలపై అమెరికా నిషేధం

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:55 IST)
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)లో పని చేసే అనేక మంది పైలట్లు నకిలీ డిగ్రీలు కలిగివున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ దేశ విమాన రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఈరోపియన్ యూనియన్ పాకిస్థాన్ విమానలపై ఆర్నెల్ల పాటు నిషేధం విధించింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదేవిధంగా పాకిస్థాన్ విమానాలపై నిషేధం విధించింది. 
 
దీంతో దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు ఆ విమానం నడిపిన పైలట్ల వద్ద నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిసింది. దీంతో విచారణ చేపట్టగా చాలా మంది వద్ద ఇలాగే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని నిర్ధారణ అయింది. 
 
పాక్‌ పైలట్లలో మూడో వంతు మంది దగ్గగ నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇటీవల తేలింది. దీంతో పైలట్ల విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆందోళన వ్యక్తంచేసింది. అమెరికానే కాకుండా, ఇప్పటికే పలు ఇతర దేశాలు కూడా ఈ చర్యలు తీసుకున్నాయి.
 
ఐరోపా సమాఖ్య ‌పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని విమానాలపై ఇప్పటికే ఆరు నెలలపాటు నిషేధం వధించింది. ఈయూకు పాక్‌ అంతర్జాతీయ విమానాలు నడపొద్దని తెలిపింది. అలాగే, ఇపుడు అమెరికా కూడా పాక్ విమాన రాకపోకలపై నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments