అబుదాబిలో 27 ఎకరాల్లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి అనుమతినిస్తూ ఆగస్టు 2015లో యూఏఈ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ దేవాలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ ఆలయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటుంది.
అతిపెద్ద సంప్రదాయ రాతి మందిరమైన ఈ ఆలయ ప్రారంభోత్సవం పండగలా జరుగనుంది. బీఏపీఎస్ మందిరం ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందని బీఏపీఎస్ హిందూ మందిర్ ప్రతినిధులు తెలిపారు. బీఏపీఎస్ ఆలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభించాలని నిర్ణయించారు.
అబుదాబిలోని భారతీయ సంఘం సభ్యులు ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో జరిగే ప్రజా సమర్పణ సభలో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.