Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి పెనుముప్పు తప్పేలాలేదు... భారీ గ్రహశకలం వచ్చేస్తోంది..

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (09:39 IST)
భూమికి పెనుముప్పు తప్పేలాలేదు. ఓ భారీ గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తోంది. సైజులో అత్యంత భారీ పరిమాణంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, దాని వేగం కూడా ఇదివరకటి అస్టరాయిడ్లతో పోల్చుకుంటే.. రెట్టింపు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. 
 
ఇంకొద్ది రోజుల్లో ఈ గ్రహశకలం భూకక్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. దీనివల్ల కొన్ని విపత్కర పరిస్థితులు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
పరిమాణంలో భారీగా.. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్త 381 మీటర్లు. ఇది భూమి వైపు అసాధారణ వేగంతో దూసుకొస్తోంది. ఈ నెల 18వ తేదీన భూకక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సైజు కంటే పెద్దగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ బ్రిడ్జ్ పొడవు 2,737 మీటర్లు.
 
ఈ గ్రహశకలం ఇప్పటిది కాదు. 1994లో దీన్ని గుర్తించారు. 1994 ఆగస్టు 9న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ సైంటిస్ట్ రాబర్ట్ మెక్‌నాట్ దీన్ని కనుగొన్నారు. 
 
భవిష్యత్తులో ఇది భూమికి అత్యంత సమీపానికి వస్తుందంటూ అప్పట్లో రాబర్ట్ మెక్‌నాట్ అంచనా వేశారు. భూమికి అత్యంత సమీపానికి వస్తోండటం వల్ల ప్రమాదకరమైన గ్రహశకలంగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments