జపాన్‌లో భారీ భూకంపం ఏర్పడింది. ఇది రిక్టార్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపంతో జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం లేదు
ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
గతంలో రిక్టార్ స్కేల్‌పై 9 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీకి కారణమైన ప్రాంతంలోనే మరోమారు భూమి కంపించినట్లు చెప్పారు.