Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌ నుంచి మెక్సికోకు.. ఎఫ్‌బీ విమానంలో అధికంగా 155 మంది ఆఫ్ఘన్లు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:33 IST)
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆగస్ట్‌ 15న మెరుపు వేగంతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, సహాయక సిబ్బంది, ఇతర ప్రముఖులతో కలిపి మొత్తం 188 మందిని కాబూల్‌ నుంచి అబుదాబి మీదుగా మెక్సికో సిటీకి తరలించేందుకు ఫేస్‌బుక్‌, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ వంటి వారి ఆర్థిక సహకారంతో ఆగస్ట్‌ 30న ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. 
 
అయితే ఆ విమానం అబుదాబి చేరే సరికి ఊహించని విధంగా 155 మంది ఆఫ్ఘనిస్థాన్‌లు అందులో అధికంగా ఉన్నారు. కామ్ ఎయిర్ సంస్థకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు, మరి కొందరు అందులో ప్రయాణించారు. ఈ విమానం అబుదాబి చేరిన తర్వాత ఈ విషయాన్ని అక్కడి అమెరికా, యూఏఈ అధికారులు గుర్తించారు. జాబితాలోని లేని 155 మంది ఆఫ్ఘన్‌ ప్రయాణికులను అబుదాబిలో వదిలేశారు. జాబితాలో ఉన్న 188 మందిని ఈజిప్ట్‌ ఎయిర్‌కు చెందిన విమానంలో కైరో మీదుగా మెక్సికోకు తరలించారు.
 
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇలా అక్రమంగా అబుదాబికి పలు విమానాల్లో తరలివచ్చిన ఆఫ్ఘన్ల సంఖ్య 3,600 వరకు ఉంటుందని అమెరికా, యూఏఈ అధికారులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వచ్చిన వీరి ఇమ్మిగ్రేషన్‌, భద్రతా విధానాలపై ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమను సురక్షితంగా తరలించిన ప్రముఖ ప్రైవేట్‌ సంస్థలకు అబుదాబి చేరిన ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments