Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత విమాన రాకపోకలపై నిషేధం ఎత్తివేత

భారత విమాన రాకపోకలపై నిషేధం ఎత్తివేత
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (13:50 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా పరిస్థుతులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. దీంతో పలు దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 27 నుంచి నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ నిషేధాన్ని కెనడా అమలు చేసింది. అప్పటి నుంచి ఐదు నెలలపాటు ఈ బ్యాన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా దీన్ని తొలగిస్తున్నట్లు కెనడా తెలిపింది.
 
అయితే భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలను ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది. 
 
కాగా, ఇటీవల భారత్ నుంచి మూడు విమానాల్లో కెనడా చేరిన ప్రయాణికులు అందరూ కరోనా నెగిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పావలా పవన్ కళ్యాణే పెద్ద సన్నాసి : మంత్రి వెల్లంపల్లి