Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ విందు పార్టీలో విషాదం - 700 మంది ఎయిర్‌బస్ ఉద్యోగుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:00 IST)
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఫ్యాన్స్ దేశంలో ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేసిన ఓ విందు కార్యక్రమం విషాదంగా ముగిసింది. ఈ విందు పార్టీలో వడ్డించిన ఆహారాన్ని ఆరగించిన వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పాలకులు విచారణకు ఆదేశించారు. 
 
పశ్చిమ ఫ్రాన్స్‌లోని మోంటోయిర్ డి బ్రిటేన్‌లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. కంపెనీ ప్రాంగణంలోనే ఉన్న ఓ రెస్టారెంటులో ఏర్పాటుచేసిన ఈ విందులో దాదాపు 2,600 మంది పాల్గొన్నారు. అనేక రకాల నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటుచేశారు. లాబ్‌స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు.
 
అయితే, విందు ఆరగించిన వారిలో 700 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వీరంతా ఎయిర్‌బస్ ఉద్యోగులు కావడం గమనార్హం. అయితే, ఇలా ఎందుకు జరిగిందన్నది ఇంకా అంతుబట్టకుండా ఉంది. దాంతో, ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. 
 
ఎయిర్ బస్ అట్లాంటిక్ సంస్థ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. కాగా, పార్టీలో వడ్డించిన ఆహార పదార్థాలను ఎయిర్ బస్ కంపెనీ క్యాంటీన్‌లోనే తయారు చేసినట్టు వర్క్స్ కమిటీ కార్యదర్శి జీన్ క్లాడ్ ఇరిబారెన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments