Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 46 మంది సజీవదహనం

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (16:53 IST)
తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 46 మంది సజీవదహనమైనారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
దక్షిణ తైవాన్‌లో కౌహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల టవర్ బ్లాక్‌లో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. భారీగా ఎగిసిన అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కింద షాపింగ్ కాంప్లెక్స్​లు, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 
 
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments