Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (16:27 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.
 
బుధవారం 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నాను. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా వైరస్ సోకగా.. వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది.
 
ప్రస్తుతం క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువలో కొనసాగుతున్నాయి. ఆ కేసుల సంఖ్య 2.06 లక్షలు(0.61 శాతం)గా ఉంది. నిన్న మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
బుధవారం టీకా డోసుల పంపిణీలో కాస్త తగ్గుదల కనిపించింది. నిన్న 35.66 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 96.82 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments