Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ.. 700మంది మృతి.. 30వేల మందికి కరోనా

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (17:01 IST)
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి కారణంగా అమెరికాలో 30వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 700 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ను మొదటి నుంచి తేలిగ్గా తీసుకున్న ట్రంప్.. వైద్య నిపుణుల సూచనలను కూడా లెక్క చేయకుండా ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రచార ర్యాలీలను నిర్వహించారు.
 
కాగా.. ట్రంప్ నిర్వహించిన 18 ఎన్నికల ర్యాలీల కారణంగా సుమారు 30వేల మందిపైగా ప్రజలు కరోనా బారినపడ్డారని.. ఇందులో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
 
'ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కొవిడ్-19: ది కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్' అంశంపై స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపి దానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య డొనాల్డ్ ట్రంప్ 18 ఎన్నికల ర్యాలీలను నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. ఈ ర్యాలీల కారణంగా 30వేల మంది కరోనా బారినపడ్డట్టు.. 700 మంది కరోనా కాటుకు బలైనట్టు పేర్కొంది. 
 
అంతేకాకుండా భారీ జనసమూహాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందన్న వైద్య నిపుణుల వాదనను తాము సమర్థిస్తున్నట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ నివేదికపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. 'ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని పట్టించుకోరు. సొంత మద్దతుదారుల గురించి కూడా ఆయన ఆలోచించరు' అంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments