Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల టీనేజ్ యువతి.. అప్పు కోసం ఒకేరోజు 17 మంది విటులతో..?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (20:38 IST)
16 ఏళ్ల టీనేజ్ యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది 23 ఏళ్ల మహిళ. ఈ ఘటన యూకేలో దారుణం చోటుచేసుకుంది. తన వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు గాను ఆమెను కూడా వ్యభిచారిణిగా మార్చింది. ఏకంగా ఒకే రోజు 17 మంది పురుషుల వద్దకు ఆ టీనేజ్ యువతిని పంపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. యూకేలోని సండర్‌ల్యాండ్‌కి చెందిన టైలర్ జో వాకర్ (23) అనే వ్యభిచారిణి కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 16 ఏళ్ల టీనేజ్ యువతికి గాలం వేసింది. 
 
తరచూ చాట్ చేస్తూ ఆమెకు దగ్గరైంది. ఈ క్రమంలో యువతికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో ఓరోజు యువతిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించింది. తానే ట్యాక్సీ బుక్ చేసి డబ్బులు కూడా చెల్లించింది.
 
యువతి తన అపార్ట్‌మెంట్‌కు వచ్చాక.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని వాకర్ ఆమెను కోరింది. యువతి వద్ద డబ్బులు లేకపోవడంతో.. వ్యభిచారం చేసి తన అప్పు తీర్చాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం మొదట ఆ యువతిని వివస్త్రగా చేసి ఫోటోలు తీసింది. ఆ ఫోటోలను ఫోన్ ద్వారా పలువురికి ఫార్వార్డ్ చేసింది.
 
ఒకేరోజు 17 మంది పురుషులతో వ్యభిచారం చేయించింది. దీనిపై బాధిత యువతి కోర్టును ఆశ్రయించగా... కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా టైలర్ జో వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments