Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలోని ఓ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (09:02 IST)
వాయువ్య చైనాలోని ఓ అపార్టుమెంటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్ నగరంలోని ఓ బహుళ అంతస్తు భవనంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 
 
అలాగే, సోమవారం మధ్య చైనాలోని ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడ కూడా భారీ  ప్రాణ నష్టం సంభవించింది. ఇటీవలి కాలంలో చైనాలోని కర్మాగారాల్లో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత 2015లో టింజన్‌లోని రసాయనాల గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్ళలో 175 మంది చనిపోయిన విషయం తెల్సిందే. గత అక్టోబరు నెలలో షెన్‌యాంగ్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments