Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన నిందితుడికి ఐదు గుంజీల శిక్ష... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (08:24 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని అత్యాచారం చేసిన నిందితుడికి కేవలం ఐదంటే ఐదు గుంజీలతో శిక్ష విధించారు. తద్వారా ఆ కామాంధుడిని నిర్దోషిగా గ్రామ పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని నవాదా ప్రాంతం అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి ఓ పౌల్ట్రీలో పని చేసేవాడు. ఆ సమయంలో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ చిన్నారి ప్రలోభపెట్టి, బలవంతంగా కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద వారిని అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌ వరకు తీసుకెళ్లవద్దని, గ్రామ పంచాయతీలో తేల్చుకుందాం అంటూ వారిని ఒత్తిడి చేశారు. గ్రామ పంచాయతీ పెద్ద ఒత్తిడికి తలొగ్గిన బాధితురాలి తల్లిదండ్రులు.. పంచాయతీకి వెళ్లారు. 
 
దీనిపై గ్రామస్థుల సమక్షంలో ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన గ్రామ పెద్దలు నిందితుడికి కేవలం ఐదు గుంజీలను శిక్షగా విధించారు. ఆ తర్వాత అతన్ని స్వేచ్ఛగా వదిలివేశారు. గ్రామ పెద్దలు విధించిన శిక్షతో గ్రామస్థులు విస్తుపోయారు. 
 
బాధితురాలికి గ్రామ పెద్దలు న్యాయం చేస్తారని భావిస్తే, నిందితుడికి న్యాయం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన నిందితుడితో ఐదు గంజీలు తీయించి, ఎలా వదిలి వేస్తారంటూ గ్రామస్థులు నిలదీస్తున్నారు. పైగా, దీనిపై అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments