Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ హల్వా భలే టేస్ట్.. ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:55 IST)
మనం ప్రతిరోజు తినే దుంపకూరలలో బీట్‌రూట్ చాలా ముఖ్యమైనది. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కూరగా మాత్రమే కాకుండా హల్వాలాగా కూడా చేయటం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటానికి ఎంతగానో దోహదపడుతుంది. కనుక ఎక్కువుగా పిల్లలకు దీనిని పెట్టడం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బీట్ రూట్‌తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బీట్ రూట్ తురుము-3 కప్పులు,
బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు,
మంచి నీళ్లు- ఒకటిన్నర కప్పు,
నెయ్యి- 4 టేబుల్ స్పూన్లు,
పంచదార - 2 కప్పులు,
జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్లు,
ఎండు ద్రాక్ష- 2 టేబుల్ స్పూన్లు,
బాదం-10,
యాలకుల పొడి-అరటీస్పూన్
 
తయారుచేసే విధానం....
బీట్‌రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి సుమారు 5 నిమిషాలు వేయించి తీసి, ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి ప్రక్కన ఉంచాలి. 
 
ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్ రూట్ తురుము వేసి మధ్యస్థమైన మంట మీద బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments