Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు కార్గిల్ యుద్ధం ఎలా మొదలైంది?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (16:53 IST)
కార్గిల్ యుద్దం... భారతదేశ చరిత్ర ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచిపోయే యుద్ధం. 1999 జూలై 26న పాకిస్థాన్‌ మూకలను తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన రోజు. మరో రెండు రోజుల్లో కార్గిల్ దివస్ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైందనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. 
 
ఈ కార్గిల్ యుద్ధంలో భాగంగా, తొలుత కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించాలని పాక్ పన్నాంగం పన్ని, ఆ దేశ సైన్యాన్ని భారత భూభాగంలోకి చొప్పించే ప్రయత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న పర్వత ప్రాంతాలను క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అయితే 1999 మేలోనే ఈ చర్యకు పాల్పడినట్లు భారత ఆర్మీ గుర్తించింది. అయితే వారు మిలిటెంట్లో లేదా ఉగ్రవాదులో అయి ఉంటారని భావించింది. పాక్ సైనికులని గ్రహించలేకపోయింది. 
 
ఇక ఆ తర్వాత కొన్ని వారాలకు పర్వతప్రాంతాన్ని ఆక్రమించింది పాక్ సైన్యమే అని నిర్ధారించుకున్న ఇండియన్ ఆర్మీ.. వెంటనే రంగంలోకి దిగింది. పాకిస్థాన్ సైన్యంను తిరిగి పంపేందుకు ఓ వైపు మిలటరీ చర్యలు మరోవైపు దౌత్యపరమైన చర్యలను భారత్ ప్రారంభించింది. పాక్ పాల్పడుతున్న చొరబాటును ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లింది. పాకిస్థాన్‌ను ఒంటరిని చేసి విజయం సాధించింది. 
 
జూలై 26,1999లో పాక్ ఆక్రమించిన భారత భూభాగం అంతటిని మన సైన్యం తిరిగి సొంతం చేసుకుంది. ఇందుకోసం కొన్ని రోజుల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వీరికి గుర్తుగా ప్రతి యేటా జూలై 26వ తేదీన కార్గిల్ దివస్ జరుపుకుంటారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments