ఎండుద్రాక్ష తింటే బరువు పెరుగుతారా? ఈ 5 పాయింట్లు తెలిస్తే?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:23 IST)
ఎండు ద్రాక్ష కొంతవరకు తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి. వాస్తవానికి ఇందులో వుండే రిచ్ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్ష ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.
 
1. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. రోజు మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
2. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తంలోకి త్వరగా చేరుతుంది.
 
3. ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కారణం అయ్యే టోమర్ సెల్స్‌తో పోరాడే గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
4. దీనిలో గ్లూకోజ్, విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్‌ను కలిగి వుంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తరుచుగా తినడం వలన శరీరంలో పులుపును స్వీకరంచే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రాకుండా చేస్తుంది.
 
5. ఎండుద్రాక్ష తినడం వలన  శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ ఆర్‌టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించిన డియాజియో ఇండియా

ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు

తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు ఏమయ్యాయి? రేవంత్ సర్కారుకి రాములమ్మ సూటి ప్రశ్న

హర్మూజ్ జలసంధిని తెరవకపోతే సర్వనాశనం చేస్తా: ఇరాన్‌కు ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్

వేగంగా వెళ్తున్న డోర్ లేని బస్సు నుంచి కిందపడి వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments