Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాల్చిన చెక్క టీతో బరువు తగ్గండి.. ఎలాగంటే?

దాల్చిన చెక్క టీతో బరువు తగ్గండి.. ఎలాగంటే?
, శనివారం, 9 జనవరి 2021 (17:29 IST)
Cinnammon
దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుతుంది. 
 
ఓవరాల్‌గా గుండెకు హాని జరగకుండా చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపుకి చెక్ పెట్టాలన్నా దాల్చిన చెక్క టీ తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే... ఎయిడ్స్‌కి కారణమయ్యే హెచ్ఐవీ వైరస్‌తో పోరాడే శక్తి కూడా దాల్చిన చెక్కకు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ టీని రోజూ కాకుండా వారానికి నాలుగు సార్లు తీసుకుంటూ మంచి ఫలితం వుంటుంది. 
 
దాల్చిన చెక్క టీ రుచి బాగుంది కదా అని ఎక్కువ తాగడం మంచిది కాదు. ఇవి రోజుకి రెండు కంటే ఎక్కువ టీలు తాగకూడదు. అలా తాగితే లివర్ సరిగా పనిచెయ్యదు. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. దాల్చిన చెక్కలను వేడి నీటిలో 15 నిమిషాలు ఉంచి... ఆ నీరు తాగినా ప్రయోజనం ఉంటుంది. 
 
లేకుంటే అర స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌ను ఒకటిన్నర గ్లాసుడు నీటిలో మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి. ఆపై తేనెను కలుపుకుని తీసుంటే దాల్చిన చెక్క టీ రెడీ అయినట్లే. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఓ కప్పు దాల్చిన చెక్క టీని సేవించడం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరితో సైడ్ ఎఫెక్ట్స్... ఎలాంటివి?