Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతిలో బెల్లాన్ని వేడిచేసి తింటే...?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:46 IST)
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియల్ గుణాలు అధిక మోతాదులో ఉన్నాయి. సాధారణంగా అప్పుడప్పుడూ పిండి వంటలు తినాలని ప్రతీ ఒక్కరిలో అనిపిస్తుంది. ఇది వాస్తవమే కాబట్టి పిండి వంటకాల తయారీలో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించాలంటున్నారు వైద్యులు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వలన మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువలన వీలైనంత వరకు చక్కెరకు బదులుగా బెల్లం తినడం అలవాటు చేసుకుంటే మంచిది. 
 
ఆయుర్వేదంలో బెల్లాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం.. గ్లాస్ బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని రోజూకు మూడుసార్లు తీసుకుంటే పొడిదగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు.. నేతిలో బెల్లాన్ని వేడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాసుకుంటే తక్షణం నొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
 
అజీర్తి సమస్యతో బాధపడేవారు.. భోజనానంతరం ఓ బెల్లం ముక్కను తింటే చాలు. కొన్ని కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు వారం రోజులు తీసుకున్నా లేదా గ్లాస్ పాలలో కలిపి తీసుకున్నా నెలసరి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. తలనొప్పికి చెక్ పెట్టాలంటే.. పెరుగులో బెల్లం కలిపి తింటే చాలు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments