వాలెంటైన్స్ డే ఎలా వచ్చిందో తెలుసా..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:51 IST)
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీనా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రేమించుకునే వారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఇక కొత్తగా ప్రేమలో పడ్డ యువతీ యువకులకు.. ఎప్పుడెప్పుడు వారి ప్రేమను తమ ప్రియుడికి లేదా ప్రియురాలికి చెప్పాలని తపన పడుతుంటారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందానని పడిగాపులతో ఎదురుచూస్తుంటారు. ఇది ఇలావుంటే.. వారు మన ప్రేమని అంగీకరిస్తారో లేదా తిరస్కరిస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం గురించి..
 
ఈ రోజున ఎక్కడ ఏ సినిమా హాల్లో చూసినా, ఏ పార్కులో చూసినా, ప్రేమికులు జంట జంటగా కనిపిస్తుంటారు. ఇక 3 రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఈ రోజైతే అమ్మాయిలు యూ ఆర్ మై వాలెంటైన్ అంటూ వారి ప్రేమికులకు చెప్తారు. అబ్బాయిలైతే నువ్వే నా ప్రేమదేవతవి అంటూ ప్రియురాలికి చెప్తారు. అసలు నిజం చెప్పాలంటే.. ఏ రోజైనా వారికి ప్రేమను చెప్పొచ్చు. కానీ ప్రేమించుకునే వారిలో ఈ ప్రేమికుల దినోత్సవానికి ఉండే ప్రాముఖ్యతనే వేరు. ఈ రోజును వారికోసమనే పెట్టారు. 
 
వాలెంటైన్స్ డేకి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. దానిలో ఓ చిన్న కథ.. మూడో శతాబ్దంలో చక్రవర్తి క్లాడియన్ రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతనికి పెళ్లి అంటే అసలు నమ్మకమే ఉండేది కాదు. ఈ పెళ్లి చేసుకోవడం వలన మగాళ్ల బుద్ధి, సామర్థ్యం నశించిపోతుందని వారు నమ్మేవారు. దాంతో వారి సామ్రాజ్యంలోని సైనికులు, అధికారులు పెళ్లి చేసుకోకూడదని వెల్లడించారు. ఈ మాట విన్న ప్రేమికులు అసహానానికి లోనయ్యారు. 
 
ఈ సమయంలో.. చక్రవర్తి క్లాడియస్ చెప్పిన మాటను వాలైంటైన్ అనే వ్యక్తి తిరస్కరించి.. ప్రేమికుల దగ్గరుండి వారికి వివాహం జరిపించారు. దీంతో క్లాడియస్ నా మాటనే తప్పంటావా అంటూ.. వాలెంటైన్‌ను ఉరి తీయిస్తాడు. ఆ రోజు ప్రేమికుల దినోత్సవం. ప్రేమకోసం, ప్రేమికుల కోసం తన ప్రాణాలను అర్పించిన వాలెంటైన్‌కు గుర్తుగా ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీనా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments