Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ గ్లాస్ మజ్జిగ తాగితే..?

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (14:30 IST)
ప్రతీ సంవత్సరం లానే ఈ వేసవి కూడా మండిపోతోంది. ఈ వేడికి జనాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ పని ఉన్నా ఉదయమో, సాయంత్రమో బయటకు వస్తున్నారు తప్ప మధ్యాహ్నం కాలు బయట పెట్టడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను పాటిస్తున్నారు.
 
ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వలన శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్ళి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగుతుంటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మజ్జిగలోని ప్రోటీన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. 
 
శరీరంలో క్యాల్షియం లోపంతో బాధపడేవారు మజ్జిగను తీసుకోవడం వలన శరీరానికి క్యాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. తరచు మజ్జిగను తాగడం వలన శరీరం ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవారు రోజూ మజ్జిగ తాగితే సరిపోతుంది. 
 
మజ్జిగతో తయారుచేసిన ఆహార పదార్థాలు తరచు తింటుంటే.. ఈ వేసవిలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాదు, శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకుని రాత్రి సమయాల్లో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే.. రాత్రివేళల్లో వేడి ఉండదు.. కాబట్టి మధ్యాహ్నం సమయాల్లో తీసుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments