Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులకు పుచ్చకాయలు కావాల్సిందే... ఎందుకంటే?

Advertiesment
పురుషులకు పుచ్చకాయలు కావాల్సిందే... ఎందుకంటే?
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:28 IST)
ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ ఉష్ణ తాపాన్ని తీర్చడానికి సమృద్ధిగా ఈ కాలంలో లభించేవి పుచ్చకాయలు. అధిక శాతం నీటిని కలిగి ఉండే పుచ్చకాయ తినడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. వేడి నుండి తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సలాడ్స్ వంటి చల్లటి పదార్దాలు అతిగా తినడం కన్నా పుచ్చకాయ తినడం అన్ని విధాల మన ఆరగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఈ పుచ్చకాయ వల్ల ఆరోగ్యానికి జరిగే మేలేంటో చూద్దాం.
 
1. పుచ్చకాయ తినడం వల్ల నోరు ఎండిపోవడం, అతిగా దాహం వేయడం లాంటివి తగ్గుతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుంది.
 
2. ఎండవేళ బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉంది.
 
3. పుచ్చకాయ మగవారిలో ఏర్పడే శృంగార సమస్యను తగ్గిస్తుంది. 
 
4. రక్తంలో ఏర్పడే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను బ్యాలెన్సు చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
5. పుచ్చకాయ పురుష హార్మోన్లని పెంచుతుంది. దీనిలో ఉండే లైకోఫిన్ అనే పదార్థం పురుషుల్లోని వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతాయి.
 
6. పుచ్చకాయ విత్తనాలలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రౌన్ కలర్ అరటిపండ్ల గురంచి తెలిస్తే అస్సలు వదలరు..