Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్ కార్పెట్‌పై పూజా హెగ్డేకు చేదు అనుభవం.. అవన్నీ కనిపించలేదట! (video)

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (19:13 IST)
Pooja hegde
కేన్స్ కార్పెట్‌పై పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. తన బృందంతో సహా భారత్ నుంచి బయల్దేరి కేన్స్ వచ్చిన పూజా హెగ్డే... అనుకోని రీతిలో తన దుస్తులు, ఫ్యాషన్ నగలు, మేకప్ సామాన్లు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని పూజానే స్వయంగా వెల్లడించింది. 
 
తాము అన్నీ పోగొట్టుకున్నామని.. ఫ్యాషన్ దుస్తులు, మేకప్ కిట్లు ఏవీ లేకుండా పోయాయని పూజా హెగ్డే తెలిపింది. కేన్స్ లో దిగామో లేదో మాపై బండ పడినట్టు అయింది. బాధపడేందుకు కూడా సమయంలేని పరిస్థితి. వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ వాకింగ్‌కు సిద్ధం కావాల్సి ఉంది.
 
ఈ పరిణామంతో తనకంటే మా మేనేజర్ ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. తానైతే... జరిగిందేదో జరిగిపోయింది అనుకున్నాను. అయితే తనతో పాటే కొన్ని ఒరిజినల్ నగలను ఉంచుకోవడం ఊరట కలిగించే అంశం. దాంతో కేన్స్ లోనే దుస్తులు తెప్పించుకుని మేనేజ్ చేశాను... అంటూ పూజా హెగ్డే తెలిపింది. 
 
ఈ సందర్భంగా "నా టీమ్ కనీసం భోజనం కూడా చేయలేదు. నేను రెడ్ కార్పెట్ వాకింగ్ పూర్తి చేసేవరకు వాళ్లు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. అన్నీ పోయాయని తెలియగానే వాళ్లు హుటాహుటీన వెళ్లి దుస్తులు, మేకప్ సామాన్లు, కొత్త హెయిర్ ప్రొడక్టులు తీసుకువచ్చి నన్ను సిద్ధం చేశారు. తాను కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టానంటే అది వాళ్ల వల్లే" అని పూజా హెగ్డే వివరించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments