Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం రోజున మాంసాహారాలు తింటున్నారా..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:37 IST)
ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇంటా నోరూరించే మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. నిజానికి ఆదివారం మాంసాహారం తినకూడదని పురాణాలు చెప్తున్నారు. ఆదివారానికి, మాంసానికి సంబంధం ఏంటనే కదా ధర్మ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
 
మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనం కూడా దాన్నే సెలవుదినంగా పాటిస్తూ సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్యమాంసాలు ఆరగిస్తున్నారు. మరికొంతమంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు. ఇంకొంతమంది డాక్టర్లే మాంసం తీసుకోమని చెప్పారని, అందుకే క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకుంటున్నట్టు చెప్తుంటారు. 
 
నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ పిలుస్తారు. ఆంగ్లంలో సైతం సన్‌డే అంటూ సూర్యుని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య ప్రధాత. అనారోగ్యాలు ఉన్నవారిని ఆదివారం నాడు సూర్యభగవానుణ్ణి పూజించమని అర్థం. ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠించమని చెబుతారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళల్లో ఎండలో ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందుతారని చెప్తారు. 
 
సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష్య శాస్త్రం చెపుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వలన ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దానివలన ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేం. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడుతాయి. ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాకుండా, ఆ ఆ రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చును. 
 
కావాలంటే 7 ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవండి. మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం వంటివి చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments