Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారికి ఆహారంపై ఇష్టం పెంచాలంటే.. ఏం చేయాలి..?

వారికి ఆహారంపై ఇష్టం పెంచాలంటే.. ఏం చేయాలి..?
, బుధవారం, 27 మార్చి 2019 (12:52 IST)
పిల్లలకు అన్నం తినిపించడం అంటేనే తల్లులకు ఓ పెద్ద పని. అందుకు కారణం వారికి నచ్చని ఆహారాలు తినిపించడమే. మరి అలాంటి చిన్నారులు ఇష్టంగా తినాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
 
ఏ కూర వండినా, ఏ వంట చేసినా దాని రుచి రూపంతో ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడే పిల్లలు ఇష్టపడి తింటారు. ఉదాహరణకు ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీకి బదులు కూరగాయముక్కలన్నీ కలిపి వెజిటేబుల్ ఇడ్లీని చేయొచ్చు. అలానే పండ్లు, కూరగాయల్ని ఆకట్టుకునేలా కోసి.. వడ్డించినా సరిపోతుంది.
 
ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లు పిల్లలపై ప్రభావం చూపుతాయని మరిచిపోకండి. మసాలాలూ, జంక్‌ఫుడ్ తింటూ పిల్లలను మాత్రం ఫలానావే తినాలి అనడం, మీకు నచ్చని, తినని పదార్థాలను ఇంట్లో వండకపోవడం అంత సరికాదు. కాబట్టి ఇంట్లో పోషకాహారానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. 
 
మీరు తింటే.. వాళ్లూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వారికి ఆహారంపై ఇష్టం పెంచాలంటే.. కథల రూపంలో వాటి ప్రత్యేకతను తెలిసేలా చేయాలి. అదీ కాదంటే ఆహారాలు ఆకట్టుకునేలా తయారుచేసి తినిపించే ప్రయత్నం చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీట్ కార్న్ పాయసం...?