సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు బాగా టైమ్ పాస్ అవుతోంది. అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్, ఆ తర్వాత కికి ఛాలెంజ్, ట్రాష్ ఛాలెంజ్ ఇలాంటివి ఎన్నో నెటిజన్‌లను మురిపించాయి. తాజాగా మరొక ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అదే మైక్రోవేవ్ ఛాలెంజ్..ఇందులో పాల్గొనే వారు దానికి సంబంధించిన వీడియోను మైక్రోవేవ్‌ఛాలెంజ్ హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అసలు మైక్రోవేవ్ ఛాలెంజ్ అంటే ఏమిటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
మనం సాధారణంగా మైక్రోవేవ్ ఓవెన్‌ను ఏదైనా ఫుడ్‌ను వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఫుడ్‌ను ఓవెన్‌లో పెట్టినప్పటి నుంచి అది లోపల తిరుగుతుంటుంది. అలా గుండ్రంగా తిరుగుతూ వేడెక్కుతుంది. సేమ్ ఫుడ్ ఎలాగైతే మైక్రోవేవ్ ఓవెన్‌లో తిరుగుతుందో అలాగే మీరు కూడా తిరగాలి. అలా రౌండ్‌గా తిరుగుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలి.
అదే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ టిక్‌టాక్ యాప్‌లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడి నుండి ఇది మరింత వైరల్ అవుతూ సోషల్ మీడియాకు చేరింది. కొంతమంది ఈ మైక్రోవేవ్ ఛాలెంజ్‌లో పాల్గొని వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు.