Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది తెలిస్తే నిమ్మ తొక్కల్ని అస్సలు పారేయరు... ఏంటది?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:44 IST)
నిమ్మకాయలు మనకు ఏ కాలంలోనైనా విరివిగా దొరుకుతాయి. అయితే వీటిని వాడటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆహార పదార్ధాల్లో నిమ్మకాయను వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ వల్ల ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా దంతాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ నిమ్మకాయ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
 
1. ప్రతిరోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని, ఒక స్పూన్ తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది.
 
2. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పల్చగా చేసిన మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే నీరసం తగ్గి హుషారుగా ఉంటుంది.
 
3. పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో 100 గ్రాముల అల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి వేయాలి. సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలి. వాటిని మూడురోజులు ఒక సీసాలో వేసుకుని నోరు వికారంగా ఉన్నప్పుడు ఒక అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలడం వల్ల వికారం తగ్గుతుంది.
 
నిమ్మకాయ వల్ల ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకున్నాము. మరి నిమ్మ తొక్కలు కూడా ఔషధంగా ఉపయోగపడతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ.... అవేంటో తెలుకుందాం.
 
1. నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి ఉంచుకుని, అవసరమైనప్పుడు ఈ పొడిలో తగినన్ని పాలు కలిపి ముఖానికి పట్టించి గంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఖరీదైన బ్యూటీ క్రీములకు బదులు ఈ వైద్యంతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
 
2. ఇరవై అయిదు గ్రాముల నిమ్మ తొక్కల పొడి, వంద గ్రాముల వంట సోడా, వంద గ్రాముల ఉప్పు కలిపి నూరి నిల్వ ఉంచుకుని దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తుంటే పళ్ల మీద గార తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments