Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?

ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?
, గురువారం, 6 డిశెంబరు 2018 (10:15 IST)
చాలామంది అజీర్తితో ఎక్కువగా బాధపడుతుంటారు. ఎందుకంటే.. వారు సరిగ్గా భోజనం చేయకపోయినా, సమయానికి తినకపోయినా అజీర్తి సమస్య వేధిస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినను ఎలాంటి ఫలితం ఉండదు. ఒక్కోసారి ఎక్కువగా తిన్నా కూడా అజీర్తిగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే చాలు...
 
1. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన తరువాత గ్లాస్ అల్లం రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి ఖనిజాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. 
 
2. రోజూ మీరు తీసుకునే ఆహారంలో మజ్జిగ లేదా పెరుగు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ రెండు పదార్థాలు అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. అందువలన తరచు భోజనంలో ఈ రెండింటిని తీసుకోవడం మరచిపోవద్దు. 
 
3. భోజనం చేసిన తరువాత గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అజీర్తిగా ఉన్నప్పుడు ఈ నీటిలో స్పూన్ ఉప్పు కలిపి సేవిస్తే సమస్య నుండి విముక్తి లభిస్తుంది. 
 
4. నిమ్మరసంలో పీచు పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తాయి. శరీరానికి కావలసిన ఎనర్జీనీ కూడా అందిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కడుపునొప్పికి నిమ్మరసం దివ్యౌషధం.
 
5. భోజనం చేసేటప్పుడు మెుదటి ముద్దలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి తీసుకోవాలి. ఆ తరువాత మీరు తినాలనుకున్న పదార్థాలన్నీ తీసుకోవచ్చు. ఇలా రోజూ క్రమంగా చేస్తే అజీర్తికి చెక్ పెట్టవచ్చును. 
 
6. సాధారణంగా హోటల్స్‌కి వెళ్ళినప్పుడు భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకంటే.. కొందరికి తిన్న ఆహారం జీర్ణం కాదు.. కాబట్టి వచ్చిన వారందరికి సోంపు ఓ కప్పులో వేసి ఇస్తారు. సోంపు అజీర్తికి మంచిగా పనిచేస్తుంది. 
 
7. కప్పు నీటిలో 2 స్పూన్ల జీలకర్రను నానబెట్టుకోవాలి. కాసేపటి తరువాత ఆ నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య ఉండదు. జీలకర్రలోని విటమిన్ డి, ఇ, మినరల్స్, క్యాల్షియం వంటి లవణాలు జీర్ణ సమస్యను నయం చేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటరితనాన్ని వదిలించుకోవడం ఎలా?