Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రవ్వ పదార్థాలు తీసుకుంటే ప్రయోజనాలు ఏంటంటే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:34 IST)
గోధుమ రవ్వ వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. గోధుమల ద్వారా తీసిన ఈ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి గోధుమరవ్వను డైట్లో చేర్చుకుంటే.. త్వరగా బరువు తగ్గవచ్చు. దీని వలన కలిగే ప్రయోజనమేమిటో చూద్దాం.
 
1. తక్కువ పరిమాణంలోనే తీసుకునే గోధుమ రవ్వ చాలా సమయం ఆకలి కాకుండా చేస్తుంది. రోజూ స్నాక్స్ టైంలో గోధుమరవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
2. గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
 
3. తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. దీనివల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది.
 
4. జీవక్రియ వేగంగా జరగటం వల్ల క్యాలోరీలు ఎక్కువగా ఖర్చై, శరీర బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తారు. కానీ వేగంగా జీవక్రియ జరగటం వల్ల త్వరగా ఆకలి కలిగి, ఎక్కువ క్యాలోరీలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి బరువు పెరుగుతారు. గోధుమ రవ్వ తినటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల ఆకలి కలుగదు.
 
5. గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాన్నమ్మ జ్ఞాపకార్థం రూ.1.25 కోట్లు ఖర్చు పెట్టిన విందు ఇచ్చిన బెగ్గర్ ఫ్యామిలీ.. ఎక్కడ?

వైఎస్ జగన్: అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారా?

రుషికొండ ప్యాలేస్, 58 గదులను 7 గదులు చేసారు, అవి జగన్ కోసమే.. మంత్రి మాటలు

5 నెలలుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ ఏం తింటున్నారు..

International Men’s Day 2024: పురుషుల సేవకు అంకింతం.. థీమ్ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్‌ పట్టు ఐడియా నాదే: విశ్వక్ సేన్

రెహమాన్ కు మాట ఇచ్చా అందుకే మాలలో వున్నా వచ్చా : రామ్ చరణ్

సిటాడెల్ - హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటున్న యష్ పూరి

కడప దర్గాకు రామ్ చరణ్.. అప్పుడు మగధీర హిట్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్?

తర్వాతి కథనం
Show comments