Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ పరగడుపున ఓ స్పూన్ నువ్వులు - బెల్లం తింటే...

రోజూ పరగడుపున ఓ స్పూన్ నువ్వులు - బెల్లం తింటే...
, గురువారం, 6 డిశెంబరు 2018 (12:26 IST)
వెనుకటి రోజుల్లో పల్లెల్లో నువ్వుల నూనెను వంటల తయారీలో వాడేవారు. ఇపుడు నూనె కాదుకదా కనీసం నువ్వులు కూడా కంటికి కనిపించడం లేదు. నువ్వుల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నువ్వులు గ్రామాల్లోనేకాదు పట్టణాల్లో సైతం అరుదుగా కనిపిస్తున్నాయి. 
 
ఈ నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండు. అందుకే వీటిని 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాంటి నువ్వుల వల్ల కలిగే ఉపయోగాలేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* నువ్వుల్లో అధిక  శాతం జింక్, కాల్షియంలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అందుకే ఎముకుల దృఢత్వం కోసం నువ్వులను ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ నువ్వులను బెల్లంతో ఆరగించినట్టయితే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు పూర్తిగా మటుమాయమైపోతాయి. 
 
* నువ్వుల నూనె వాడటం వల్ల చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇందులోవుండే మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది. 
 
* నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది.
 
* నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.
 
* నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి.
 
* నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'చక్కెర'కు విరుగుడు మెంతులు.. ఔషధ గుణాలు పుష్కలం