Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లేహ్యం తింటే నరాలకు బలం, నవ యవ్వనం (Video)

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (23:09 IST)
ప్రకృతిపరంగా మనకు లభించేవాటి గురించి చాలామందికి తెలియదు. కొన్ని ఔషధ చెట్లు మన ఇంటి పక్కనే రోడ్లపై కనబడుతుంటాయి కానీ వాటి విలువ తెలియక వాటిని పీకి పారేస్తుంటాం. అటువంటి చెట్లలో అశ్వగంధ కూడా ఒకటి. ఇవి పల్లెటూరి ప్రాంతాల్లో అక్కడక్కడ కనబడతాయి. ఈ అశ్వగంధతో ఎన్నో ఆరోగ్య ప్రయయోజనాలు దాగి ఉన్నాయి.
 
హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్దిగా ఉన్నాయి. పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్ ఇ కూడా అశ్వగంధలో హెచ్చుగానే ఉంది. అశ్వగంధ క్యాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా నరాల నీరసాన్ని తగ్గిస్తుంది. అశ్వగంధలో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు వంటి రకరకాల నొప్పులు తగ్గిస్తుంది. అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.
 
2. డిప్రెషన్‌తో బాధపడే వాళ్లకు అశ్వగంధ అద్భుత ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ డిప్రజంట్.. డిప్రెషన్‌ని తగ్గించి.. ప్రశాంతతను కలిగిస్తుంది.
 
3. ఇటీవలి కాలంలో చాలామంది లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యలకు వెంటనే ట్రీట్మెంట్ అందివ్వడం చాలా అవసరం. అశ్వగంధలోని అద్భుత ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది. అశ్వగంధ చూర్ణం ద్వారా శృంగార సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
 
4. ప్రతిరోజు రెండుసార్లు ఒక స్పూన్ అశ్వగంధ లేహ్యం లేదా అర స్పూన్ పొడి లేదా రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి. దీనివల్ల వీర్యకణాల నాణ్యత, పరిమాణం, శృంగార సామర్థ్యంలో చెప్పుకోదగిన తేడాను గమనించవచ్చు.
 
5. అశ్వగంధ తీసుకుంటే శక్తి మరియు మొత్తం శరీరం బలం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది నరాల బలానికి, పునరుత్పత్తి అవయవాలు యవ్వనానికి మరియు శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. తద్వారా శరీరం బలహీనత మరియు అలసట నిర్మూలించి కొత్త శక్తిని తెస్తుంది. అంతేకాక మనస్సుకు విశ్రాంతి కలిగించి మంచి నిద్రను అందిస్తుంది.
 
6. అశ్వగంధ మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

తర్వాతి కథనం